భూమన్ రాయలసీమ పరిరక్షణ కమిటి
*రాజకీయ పార్టీలు వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడం, ప్రజల జీవితాలు కునారిల్లిపోయేలా చేయడం విచారకరం.
*సర్కారాంధ్ర, రాయలసీమల్లో పెల్లుబుకుతున్న ఆవేశానికి, ఆక్రోశానికి బలీయమైన కారణం ఉంది.
*అన్ని పార్టీలు చేసిన మోసానికి ఆ ఆగ్రహం ప్రతిఫలం.
*తెలంగాణ ఉద్యమానికి 12 ఏళ్ల వర్తమానం ఉంది.
*తెలగాణకు అన్ని పార్టీలు సానుకూలత వ్యక్తం చేసినప్పుడు, ఏం జరగబోతోంది, మనం ఏం వాంఛింఛాలనే అవగాహన లేకపోవడమే ఈ దుస్థితికి కారణం.
*రాష్ట్రం విడిపోతే జరిగే పరిణామాలు ఇవీ అని రాజకీయ పార్టీలు ఈ పన్నెండేళ్లలో నచ్చ జెప్పవలసింది.
*అలా చేయకపోవడం ఈ దుస్థితి వచ్చింది.
*ఇతర రాష్ట్రాల్లో నివసించే తెలుగు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో కూడా గమనించాలి.
*సీమాంధ్ర అనే పదం అభ్యంతరకరం.
*తెలంగాణ ఏర్పడితే రాబోయే పదేళ్లలో రాయలసీమలో పెద్ద ఎత్తున ఉద్యమాలు పెల్లుబుకుతాయి, ఈ మూడు ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రాలుగా మనగలవని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది.
*దేశంలో రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ శాస్త్రీయంగా, హేతుబద్ధంగా పూర్తి కాలేదు.
*ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లలో హేతుబద్ధత ఉంది.
*కొత్త రాష్ట్ర డిమాండ్లు రావాలి, దేశంలో రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ పూర్తి కావాలి.
*సర్కారాంధ్ర, రాయలసీమల్లో రాజకీయ పార్టీల మోసాలకు, కుట్రలకు ఎవరు బలవుతున్నారో మనం చెప్పాలి.
*పదే పదే ఆందోళనలతో అభివృద్ధి కుంటు పడింది, చాలా మంది జీవితాలు విచ్ఛిన్నమయ్యాయి.
*దీనికి ముగింపు పలకాలి.
*సామరస్య పూరిత వాతావరణం తీసుకురావాల్సిన తరుణం ఆసన్నమైంది.
హనుమాన్ చౌదరి
*త్వరితగతిన మార్పులు వస్తున్నాయి.
*కలవడం విడిపోవడం చారిత్రక సత్యం.
*తెలుగువాళ్లం1800 సంవత్సరంలో రెండుముక్కలై పోయాం.
*1947లో కలిశాం, ఈ మధ్య కాలంలో ఎంతో వ్యత్యాసం వచ్చింది భాషలో, ప్రజా చైతన్యంలో తేడా వచ్చింది.
*1956లో తెలంగాణ ప్రజలు వేరే రాష్ట్రంలో ఉండాలని కోరుకున్నారు.
*రెండు రాష్ట్రాలున్నా తెలుగువాళ్లం అని చెప్పుకోవచ్చు.
*హిందీ వారికి 10 రాష్ట్రాలున్నాయి.
*బెంగాలీ, తమిళలకు రెండు రాష్ట్రాలున్నాయి.
*మనకు మూడు రాష్ట్రాలుంటే నష్టమేంటి..?
*ఒకప్పుడు రాయలసీమ వారు సర్కారు వాళ్లతో వేగలేం, ఆంధ్రతో కలవం మద్రాసు రాష్ట్రంలోనే ఉంటామన్నారు.
*అప్పుడే శ్రీబాగ్ ఒడంబడిక చేసుకున్నారు.
*ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన మరుక్షణం పెద్దమనుషుల ఒప్పందానికి తూట్లు పొడిచారు.
*తెలంగాణ రాష్ట్రం రాబోతోంది, కానీ రాయలసీమ ఆకాంక్షలు గుర్తించాలి.
*సీమాంధ్ర రాష్ట్రం వచ్చిన ఐదారు నెలల్లో ఇలాంటి ఉద్యమం వస్తుంది.
*1997 నుంచి 8 సంవత్సరాల్లో హైదరాబాద్ అద్భుతమైన ప్రగతిని సాధించింది.
*కొత్తగా వచ్చే రాష్ట్రంలో ఇంతకు మించి రాజధానిని కట్టుకోవచ్చు.
*ఐదువేల ఎకరాలు సేకరించి డెవలప్ మెంటుకు ఇవ్వాలి.
*ఐదారు ఏళ్లలో అద్భుతమైన రాజధాని వచ్చే అవకాశం ఉంది.
*హైదరాబాదు ఉమ్మడి రాజధాని అంటున్నారు, ఏ కారణం వల్ల ఇక్కడ ఉండాలో చెప్పాలి.
*నదీజలాలు పెద్ద సమస్య అని చెప్తున్నారు.
*సహజ వనలరుల దేశానికి చెందుతాయి.
*అన్ని నదుల సంధానం చేసి నేషనల్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలి, దాని ద్వారా రాష్ట్రాలకు నీరు కేటాయించాలి.
*భాషా సంస్కృతికి సంబంధించి ఉమ్మడి సాహిత్య పరిషత్ ఉండొచ్చు.
*ప్రభుత్వం పరంగా ఉద్యోగాలు ఈ దేశంలో పుట్టడం లేదు.
*తెలంగాణ వారు అందరికీ అభయహస్తం ఇస్తున్నారు.
*అన్నదమ్ముల్లా విడిపోయి కలిసి ఉండటం అవసరం.
*రాష్ట్రాలు రెండా మూడా ఇపుడే తేల్చుకోవాలి.
*ఇప్పుడు దేశం గురించి ఆలోచించే నాయకులు లేరు, మంచి చెడుల గురించి మేధావులు ఆలోచించాలి.
జోన్నవితుల
*ఈ ఉద్రికత్తతలకు ప్రధాన కారణం, నడిపించే నాథుడు లేడు.
*ఈ ప్రకటన ప్రభావం ఏమిటో ప్రజలకు చెప్పాల్సింది నాయకులు.
*ఆ నాయకులు కనిపించడం లేదని వ్యంగ్యంగా పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు.
*మీరు ఉద్యమంలోకి రండని ప్రజలు నిస్సహాయంగా రాజకీయ నాయకులను కోరే స్థితి వచ్చింది.
*ఎవరిని ఎన్నుకున్నామో, ఎవరిని నమ్ముతున్నామో ఆలోచించుకోవాలి.
*డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన తర్వాత ఇలాంటి ఆందోళనలు వచ్చాయి, కేంద్రం వెనక్కి తగ్గింది.
*అప్పుడు ఇక్కడ (తెలంగాణలో) మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి.
*అందరం అన్నదమ్ములం, సంయమనం పాటించాలి అన్నారు.
*చైనా వాళ్లు మన భూభాగంలోకి పదే పదే వచ్చినా కేంద్రం నిస్సహాయంగా, ఏ చర్యా తీసుకోలేకపోయింది.
*అలాంటి వాళ్లు, ఒక జాతిని విడదీసేటప్పుడు చాలా తేలిగ్గా వాళ్ల నిర్ణయాలు చెబుతున్నారు.
*ఇరు ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు, బాధలకు గురవుతున్నారు.
*తెలంగాణ ఉద్యమంలో నాయకులు వ్యూహాత్మకంగా, ప్రణాళికా బద్ధంగా ఎందుకు ప్రత్యేక రాష్ట్రం కావాలో చెప్పినంత సుస్పష్టంతా అక్కడ (సీమాంధ్రలో) ఒక్కరూ చేయలేకపోయారు.
*తెలంగాణ వస్తే లాభనష్టాలు ఏమిటో నాయకులు తమ ప్రాంతాల వారికి వివరించి చెప్పాలి.
*తెలంగాణ రావడం నాకిష్టమే, బాధపడిన వాడు, దోపిడీకి గురైన వాడు తిరగబడాలి.
*ఒకప్పుడు ఇక్కడ జరిగిన విధంగా ఇప్పుడు అక్కడ ఆత్మహత్యలు మొదలయ్యాయి.
*ఒక నిర్ణయంతోనే ప్రతిదీ జరిగిపోవడానికి సోనియా గాంధీ మాట బ్రహ్మరాత కాదు.
*నిర్ణయాల్లో సడలింపులు, కొనసాగింపులూ ఉంటాయి.
*రాజకీయ నాయకులే ప్రజలకు వాస్తవాలు చెప్పి సామరస్య వాతావరణం కల్పించాలి.
చలసాని
*రాష్ట్ర విభజన ఆపగలం అని ఇంకా ఎవరైనా అనుకుంటే అది అవివేకం, అవాంఛనీయం.
*ఇంకా ప్రజల మధ్య విద్వేషాలు పెంచకూడదు.
*పరిష్కారం దిశగా మనం వెళ్లాలి.
*సరిహద్దులు, నీటి పారుదల, పోలవరం, హైదరాబాద్ కీలకాంశాలు.
*హైదరాబాదుతో ఆర్థిక, మానసిక అనుబంధం ఉంది, దాన్ని గ్రేటర్ మెట్రోపాలిటన్ గా ఉమ్మడి రాజధానిగా చేయాలి.
*తెలంగాణ వారు ఒక్కమెట్టు దిగి ఆలోచించాలి.
*సీమాంధ్ర వారు ఇప్పటికైనా హక్కుల ప్రాతిపదికన పాటుపడాలి.
ప్రో- శంకర్
ఉత్తరాంధ్ర గురించే మాట్లాడతాను. ఎంత త్వరగా ఈ రాష్ట్రాన్ని విభజిస్తే అంత శ్రేయస్కరం.
ఒక ఉప ప్రాంతీయ సంస్కృతిపై మరో ఉప ప్రాంతీయ సంస్కృతి పెత్తనం చెలాయిస్తోంది. భాష బాగుండదు, యాస బాగుండదు అని సినిమాలలో హేళన చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమానికి అదీ ఒక కారణం.
హైదరాబాద్ 1905 నాటికే అంతర్జాతీయ స్థాయి నగరం.
విశాఖపట్నం 1925 కే అంతర్జాతీయ స్థాయి నగరం.
పారిశ్రామికంగా విశాఖ అభివృద్ధి చెందింది.
కలిసుందాం. ఒకవేళ విడిపోతే ప్రత్యేకాంధ్ర కేరళ కన్నా అభివృద్ధి చెందుతుంది.
త్వరగా ఈ సమస్యకు తెర దించాలని పౌర సమాజానికి నా విన్నపం.
*రాష్ట్రం నాకు ఒక సాంస్కృతికమైన అంశం.
*మానసికంగా సిద్ధగా లేనప్పుడు, ప్రజల్లో ద్వేష భావాలు క్షణక్షణం అభివృద్ధి చెందుతున్న సందర్భంలో నేనింకా మానసికంగా కోలుకోలేదు.
*ప్రకటన వచ్చిన రోజు అదొక షాక్, ఆరోజు కారు నడుపుతూ ఒక ఆటోకు ఢీకొట్టాను.
*రెండు ప్రాంతాల్లోనూ బలిదానాలు బాధాకరం.
*ఎప్పుడూ శాంతి కోరుకునే వ్యక్తిని.
*రాష్ట్రం విడిపోయినా తెలుగు గమనం అనంతంగా కొనసాగాలి. (పాటల ద్వారా భావ వ్యక్తీకరణ)
సజయ కేరింగ్ సిటిజన్
*రాష్ట్ర విభజన అనివార్యమనే సంకేతాలు గత నాలుగేళ్లుగా స్పష‌్టంగా బయటకు వస్తున్నాయి.
*వివేకవంతమైన రాజకీయ వ్యవస్థ, విభజన వరకు పరిస్థితి వస్తే ఏంచేయాలనే కార్యాచరణ గురించి ఆలోచింల్సిన అవసరం ఉంటుంది.
*అలాంటి రాజకీయ నాయకత్వం కోస్తాంధ్ర, రాయలసీమలో కరువైంది.
*హైదరాబాదులోని సీమాంధ్రల పిల్లు మేం ఎక్కడ లోకల్ అని అడుగుతున్నారు.
*హైదరాబాదులో పుట్టి పెరిగిన సీమాంధ్ర వారి పిల్లలు మేం ఎక్కడ లోకల్ అవుతాం అని అడుగుతున్నారు.
*నీళ్లు, ఉద్యోగాలు, పారిశ్రామిక ప్రకతి గురించి స్పష్టంగా రోడ్ మ్యాప్ ఇచ్చే వ్యవస్థ లేదు.
*ఒక రాజకీయ అంశం నాలుగేళ్లుగా దేశ వ్యాప్తంగా నలుగుతున్నప్పుడు, ఆ అంశాన్ని పౌర సమాజంలో పెట్టి చర్చించే వ్యవస్థ లేకపోవడం కోస్తా వారు ఆలోచించాల్సిన విషయం.
*పౌర సమాజ వ్యవస్థ కూడా ఆంధ్రలో విచ్ఛిన్నం కావడం దురదృష్టకరం.
*అందుకే అక్కడి యువతకు దిశానిర్దేశం లేకుండా పోయింది.
*అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ నాయకులు నిలబడి, మన ప్రాంతానికి అన్యాయం జరగకుండా మేముంటాం, ప్రజల మనోభావాలకు విలువనివచ్చే వాళ్లం మేమున్నాం అని చెప్పేవాళ్లు ఒక్కరూ లేరు.
*అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం దీనికి బాధ్యత వహించాలి.
*ఒక రాజకీయ నాయకుడు రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తానని మాట్లాడుతున్నారు.
*ఎవరూ దాని గురించి మాట్లాడలేదు.
*ప్రజల మధ్య వైషమ్యాలను పెంచడానికి రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి, దాన్ని ఆపాలి.
*దాన్ని ప్రశ్నించడానికి సీమాంధ్రలోని పౌర సమాజం ముందుకు రావాలి.
*రెండు ప్రాంతాల వారూ, ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతుందనే విశ్వాసం కల్పించాలి.
లక్ష్మణ్ రెడ్డి జ.వి.వె
*సీమాంధ్రలో విధ్వంసాలకు స్వస్తి పలకాలి.
*రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి అనేక కుటుంబాలు హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డాయి.
*హైదరాబాదు మాది కాదని సీమాంధ్ర వారు మానసికంగా సిద్ధపడటం లేదు.
*హైదరాబాదుపై తెలంగాణ వారికి ఎందుకు అంత స్వార్థం..?
*అందరి సమిష్టి కృషి వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందింది కాబట్టి కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండాలి.
*దోపిడీదారులు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు, అలాంటి వాళ్లను శిక్షించాలి.
*మరో హైదరాబాదు నగరాన్ని నిర్మించాలంటే వందేళ్లు పడుతుంది.
*తొమ్మిది జిల్లాల తెలంగాణ, హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం, సీమాంధ్రగా... రాష్ట్రాన్ని మూడు భాగాలు చేయాలి.
దేవి
*రెండు వైపుల ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామంటూ, వాళ్ల ఆకాంక్షలతో నిమిత్తం లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న రాజకీయ క్రీడే... రెండు వైపులా ప్రజల్లో భావోద్వేగాలకు కారణం.
*కాంగ్రెస్ ప్రకటన వెనుక సంకుచిత రాజకీయ ప్రయోజనాలే దాగి ఉన్నాయి.
*రహస్య ఎజెండాలను ప్రజలు అర్థం చేసుకోవాలి.
*సాంస్కృతిక అంశం భావోద్వేగాల్లో కీలకపాత్ర వహిస్తోంది.
*మీడియా ప్రవర్తన కూడా సరిగా లేదు.
*ఇరువైపులా నిలబెట్టడం ఎలా, వనరుల దోపిడీ జరగకుండా కాపాడటం ఎలా అనే దిశగా చర్చ జరగాలి.
*రెండు వైపులా ఎన్నో ఆకాంక్షలున్నాయి వాటిని మ్యానిప్యులేట్ చేయడానికి రాజకీయ నాయకులు ప్రయత్నించవద్దు.
*ఒక వేళ ప్రయత్నిస్తే, రేపు అవే ఆకాంక్షలు రాజకీయ నాయకులు బుద్ధి చెప్పడానికి కారణం అవుతాయి.
పోతూరి వెంకటేశ్వరరావు
*ఒక నిర్ణయం జరిగిపోయింది, అది తిరుగులేని నిర్ణయం అనిపిస్తోంది.
*తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది.
*కోస్తా జిల్లాల్లో, రాయలసీమలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
*ఆ ప్రాంతంలో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని నిజాయితీగా కోరుకునే వారున్నారు, వాళ్ల ఆకాంక్షతో ఏకీభవించలేకపోయినా గౌరవించాల్సిన అవసరం ఉంది.
*ఇది యూపీఏ సమన్వయ కమిటీ తీసుకున్న నిర్ణయం, వెనక్కి పోయే పరిస్థితి లేదు.
*అక్కడ ఉద్యమం వాస్తవిక దృష్టితో నిర్వహిస్తున్నట్టు కనిపించడం లేదు.
*విభజన వల్ల వచ్చే సమస్యలేంటి, వాటిని సామరస్యపూరిత వాతావరణంలో ఎలా పరిష్కరించుకోవాలి, అని కాకుండా, నిర్ణయాన్ని తిరగదోడించాలనే ప్రయత్నంలో వాస్తవిక దృష్టి కనిపించడం లేదు.
*ప్రజల్లో ఆవేశాలు వచ్చినప్పుడు, నాయకులు సరైన మార్గంలో నడిపించాలి.
*దురదృష్టవశాత్తు ఈ పరిస్థితిలో కూడా మనం ఏంచేయాలి, మన భవిష్యత్తు ఏంటి అనేవి మాట్లాడటం లేదు.
*బలవంతంగా ఎంతకాలం కలిసుంటాం, బలవంతంగా సమైక్యం సాధ్యమా..?
*సమస్యల గురించి మాట్లాడకుండా ఆందోళనను ప్రోత్సాహించడం సరికాదు.
*తెలుగు ప్రజల మధ్య సుహృద్భావం రావాలి.
*విద్వేషాలు పెంచితే సమస్యలుపరిష్కారం కావు.
*భవిష్యత్తులో ఈ ద్వేషాలు భవిష్యత్తులో అడ్డు వస్తాయి.
*ద్వేషపూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలకిది సమయం కాదు.
*వెనకబడిన రాయలసీమలో ఎందుకు పరిశ్రమలు రాలేదో ఎవరూ మాట్లాడటం లేదు.
కృష్ణమూర్తి జై ఆంద్ర
*సీమాంధ్రలో కొందరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, సామరస్య వాతావరణంలో సమస్య పరిష్కరిద్దాం.
*రాజకీయాంశాలు, హైదరాబాద్, నదీజలాల అంశాలతో ముడిపడి ఉన్న విషయమిది.
*హైదరాబాద్ ఆదాయం, ఇతర అంశాలపై స్పష్టత లేకే సీమాంధ్రలో ఉద్యమం జరుగుతోంది.
*తెలంగాణ వారు సంమయనంతో ఉద్యమం చేశారు, వారి ఆకాంక్షను మేం గౌరవిస్తున్నాం.
*1972లో మేం ప్రత్యేకాంధ్ర కావాలని కోరాం.
*హైదరాబాదులో ఐటీ రంగం నుంచి 49 వేల కోట్ల రూపాయలు వస్తుంది.
*హైదరాబాదులో ఉద్యోగాలపై సీమాంధ్ర యువతలో అనుమానాలు, ఆందోళన ఉన్నాయి.
*హైదరాబాదు ఆదాయాన్ని ఎలా పంచుతారో చెప్పాలి.
*48సంవత్సరాలు మా రక్త మాంసాలతో, మా పన్నులతో హైదరాబాదు మహానగరంగా ఎదిగింది కాబట్టి, ఇకపై 48 సంవత్సరాలు హైదరాబాదు ఆదాయాన్ని జనాభా ప్రాతిపదికన ఆంధ్ర ప్రాంతానికి పంచాలి.
పద్మనాభరెడ్డి సుపరిపాలన వేదిక
*మన దేశంలో రాష్ట్రాలు విడిపోవడం కొత్త కాదు.
*పంజాబ్ పునర్విభజనకు, మనకు పోలిక ఉంది.
*పంబాజ్ ను మూడు ముక్కలు చేశారు.
*ప్రతి అంశానికీ ఒక కమిషన్ ను పెట్టారు.
*ఇప్పుడు మనకు అంత అవసరం లేదు, కొన్ని అంశాలు మాత్రమే నిర్ధారించాల్సి ఉంది.
*తెలంగాణపై కేంద్రం పొడి పొడి మాటలతో చెప్పడం వల్లే తప్పుడు సంకేతాలు వెళ్లి, అల్లకల్లోలం అయింది.
*కేంద్రం ఇప్పటికైనా పూర్తి అవగాహన కల్పించేలా ప్రకటన చేయాలి.
*ఇక్కడి నుంచి ఉద్యోగులు ఎవరూ వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే సర్దుబాటు చేయాలి.

No comments:
Post a Comment