Sunday, April 13, 2014

.. కవుల గర్జన .. 22


.. కవుల గర్జన .. 
ఓనమాల రహదారిలో 
ముప్పైఅరు యాసలు నాతెలుగు సొంతం..  
ప్రాచీన భాషగా - ప్రపంచాన 14స్థానం.. 
కొమ్ములోచ్చిన భాష - తలకట్ల భాష నా తెలుగు 
మాటై మాట్లాడుతుంది - పాటై పోట్లాడుతుంది
.. కవుల గర్జన ..   

అక్షర సమరంలో 
పద్యం , అవధానం నాతెలుగు సొంతం.. 
రచనా - వచన సాహిత్యంలో 
నా కలం - తెలుగు గళం.. 
నడుస్తున్న పుటలమీద - పొడుస్తున్న పాటాలమీద
.. కవుల గర్జన .. 

తరతరాల జాతిస్పృహలో  
ఆహారం, ఆహార్యం నాతెలుగు ప్రత్యేకం 
కట్టు బొట్టు, (కట్టుబాట్లు) పంచకట్టిన తలపాగా.. 
మట్టి మమకారాలలో.. నా శ్వాస తెలుగు దేహం 
కూచిపూడిలా నాట్యమాడింది - అవకాయతో కడుపునింపింది
.. కవుల గర్జన .. 

మానవీయ బావాలలో  
విశ్వశ్రేయోభిలాషులు నాతెలుగు వెలుగులు 
తెలుగు భాషా కవులు - జాతీయ భావ కవిత్వం/సాహిత్యం 
ప్రపంచికరణలో పలకరించిన  - కంప్యూటరీకరణలో పులకించిన   
సంప్రదాయ చైతన్యం .. సామాజిక ప్రయోజనం  
లే లేరా లేచి లెమ్మంది - రా  రారా రాసి రమ్మంది 
.. కవుల గర్జన .. 

రాజ్యాలేలిన రాజబాషలో 
కాకతీయ సామ్రాజ్యం - విజయనగర భువనవిజయం 
ఏడుకొండలు.. వెయి స్థంబాలగుడి.. తోణికిసలాడే శిల్పకళానైపుణ్యం 
కొండపల్లి బొమ్మలు..          
   

No comments:

Post a Comment