.. కవి గర్జన ..
ఓనమాల రహదారిలో
ముప్పైఅరు యాసలు నాతెలుగు సొంతం..
అచ్చులు అల్లుకున్నహల్లులు.. ప్రాచీన భాష నా అజంతభాష
కొమ్ములొచ్చిన నాతలకట్లు.. ప్రపంచాన14వ స్థానం నా తెలుగుభాష
మాటై మాట్లాడుతుంది - పాటై పోట్లాడుతుంది
.. గిడుగు జాడ - కవి గర్జన ..
సాహిత్య సీమలలో
పద్యం, అవధానం నాతెలుగు సొంతం..
తెలుగు భాష కవులు - జాతీయ భావ కవిత్వం
వచన కవిత్వ, గద్య రచనా(అక్షర) సమరంలో..
నడుస్తున్న పుటలమీద - పొడుస్తున్న పాటాలమీద
.. కాలోజి గొడవ - కవి గర్జన ..
అధికార భాషలో
తెలుగోడి ఆత్మగౌరవం నా తెలుగు దేశం
సంప్రదాయ చైతన్యం .. సామాజిక ప్రయోజనం
ప్రపంచికరణలోన పలకరించి - కంప్యూటరీకరణలోన పులకించి
యువత లేచి లెమ్మంది - మహిళా కలసి రమ్మంది
మాతృభూమిలో - మాతృభాషలో
.. ఎన్.టి.అర్ ఆవేశం - కవి గర్జన ..
తరతరాల జాతిస్పృహలో
ఆహారం, ఆహార్యం నాతెలుగు ప్రత్యేకం
కట్టు బొట్టు, పట్టుచీర కట్టిన.. కట్టుబాట్లు పంచకట్టిన తలపాగా..
నుడికారాలలో (మట్టి) మమకారాలలో.. నా శ్వాస తెలుగు దేహం
కూచిపూడిలా నాట్యమాడింది - అవకాయలా కడుపునిండింది
.. మహ ప్రస్థానం - కవి గర్జన ..
తెలుగు నాడులో
శ్రీకృష్ణరాయుని ఆముక్త మాల్యదలో నా తెలుగు లెస్స
అన్నమయ్య సంకీర్తనం - గుణాడ్యుని గుణం
దాశరధి దర్శనం.. కాళోజి గొడవలు
విశ్వనధ సాహిత్య చంద్రం - గురజాడ జాడలు
చలం కలం - కపిలరాయ గడియారం
శ్రీనాద్ సీసం - సురవరం అమరం..
మానవీయ బావాలలో
విశ్వశ్రేయోభిలాషులు నాతెలుగు వెలుగులు
ప్రపంచికరణలో పలకరించిన - కంప్యూటరీకరణలో పులకించిన
తెలుగు భాషా కవులు - జాతీయ భావ కవిత్వం
లే లేరా లేచి లెమ్మంది - రా రారా రాసి రమ్మంది
.. గద్దరు గళం - కవి గర్జన ..
సైన్సు బోధించగల భాష.. దేశభాషలేందు తెలుగులెస్స..
కాకతీయ సామ్రాజ్యం.. భువనవిజయం..
వెయి స్థంబాలగుడి.. కొండపల్లి బొమ్మలు..
తెలుగు జాతి చైతన్యం - శిల్పకళా నైపుణ్యం..
.. మహ ప్రస్థానం - కవి గర్జన ..
సురభి.. బొంతలు .. గోంగూర.. గొబ్బిళ్ళు.. రాగి సంగటి.. కోర్రబువ్వ..
తోలుబొమ్మలాటలు.. రామదాసు.. అన్నమయ్య.. త్రిలింగ శివక్షెత్రాలు..

కవిత చాలా బాగుంది
ReplyDelete