Monday, February 17, 2014

తెలుగు

తెలుగు భాష ప్రమాదంలో ఉందా ?   తెలుగు జాతి ప్రమాదంలో ఉందా  ?
తెలుగులేని జాతిని ఎమనీ పిలవాలి ?
ఆంగ్లేయులపాలనలో నాణేలమీద   కనిపించిన తెలుగు..  తెలిగీయుల పలనలో పెదాలమీద కనిపించకపోతుంటే......
చుస్తుంటారా.. చూస్తూనే ఉంటారా.. రండి..  కలసిరండి..   కదిలిరండి ....
తెలుగు భాష రక్షణకై సైనికులలా - తెలుగుజాతి పక్షానికై సేవకులలా ! తెలుగువీర మిత్రుల్లారా..

నాడు మన భాషను - మన సంస్కృతి (సంప్రదాయాలను) అవహేళనతో దూరీకరించారు.. అది శారీరక హింస..
నేడు ప్రపంచికరణ - కంప్యూటరీకరణ (ఆధునికత) పరాచకాలతో పరాయికరించారు.. ఇది మానసిక హింస..
అభివృద్ధి చెందిన.. పది దేశాలను తీసుకున్నట్టు అయితే రెండు దేశాలు మాత్రమె ఆంగ్లం మాతృభాషలు.. మిగిలిన ఎనిమిది దేశాలు తమ తమ మాతృభాషలె అన్న విసయాన్ని గుర్తుంచుకోవాలి..!        

ఈ భాషాసమస్య ప్రజల నుంచి వచ్చింది కాదు, మన ప్రభుత్వం తెలుగుభాష పట్ల తన కర్తవ్య బాద్యతలన్ని  పూర్తిగా విస్మరించడం మూలాన ఏర్పడిన భాషాసంక్షోభమిది . 
ప్రపంచంలో ఏ భాషైనా ప్రభుత్వ ఆదరణతోనే బతికి బట్టకడుతుంది. అమెరికాలో అంగ్లమైన, అరేబియాలో అరబ్బీ అయినా !!     కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం  వోట్ బ్యాంక్ రాజకీయాల్లో మునిగి ఆ బాధ్యతని పూర్తిగా గాలికొదిలేసింది. 
పరాయి రాష్టాలనుంచి దిగుమతి అవుతున్న అయ్యేయెస్ లూ, ఐపీయెస్ లూ తెలుగువాళ్ళ ప్రభుత్వంలో తెలుగు అధికారభాషగా అమలు కాకుండా అడ్డుపడుతున్నారు. అంతా కలిసి కావాలని పైనుంచి తెలుగుని తొక్కేస్తూ ప్రజల్లో మార్పొచ్చిందని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అసలు తెలుగుని జన్మలో చదవకుండానే డిగ్రీలు సంపాదించడానికివీలుకల్పించారు....

మనసుతో పనిలేని ఓ యంత్రమా ఈ తెలుగు వాడు ..?
ఏ జాతి  సమస్త వ్యవహారాలూ ఆ జాతి మాతృభాషలో జరుగుతాయో ఆ జాతి సుఖపడుతుంది. ఆంగ్లేయులను వాళ్ళ దేశాలను పరిశీలిస్తే దురాక్రమణత్వం వల్ల భౌతిక సంపదలు సమకురాటమేకాక వారి భాష కూడా వాళ్ళ ఆక్రమించిన దేశాల్లో రాజ్యం ఏలింది . ఏలుతున్నది. తమ జీవితంలో అన్ని రంగాల్లో తమ మాతృభాషా వాడుకంలో ఉండేలా  వాళ్ళు కృషి చేస్తారు , ఇంట్లో , ఆఫీసులో , కోర్టులో చివరికి చర్చిలో కుడా వాళ్ళు మాతృభాషలోనే  వ్యవహారాలూ నడుస్తాయి . కాబట్టే వారి భాష వారు సుఖపడుతున్నారు. 

తెలుగు ప్రజలు ఇంట్లో తెలుగు మాట్లాడుకున్న, ఆఫీసులో ఇంగ్లీష్ , కోర్టులో ఇంగ్లీష్ , కొన్ని ప్రాంతాల్లో హింది లేదా ఉర్దూ మాట్లాడల్సివస్తుంది. చివరికి దేవుడి ప్రార్థన చేసుకుందామన్న సంస్క్రుతంలోనో , అరబ్బీ లోనో  చేసుకోవలసివస్తుంది . తెలుగు మనిషి  మనసుతో పనిలేని ఓ యంత్రం లాగా మారాడు.. తెలుగు  క్రైస్తవులు తమ ఆద్యాత్మిక వ్యవహారాలన్ని తెలుగులోకి మార్చుకోవడం వల్ల కనీసం మానసిక ఆనందాన్ని పొందగలుగుతున్నాడు.  తెలుగు  హిందువులు ,  తెలుగు ముస్లీంలు  మొదట తమ ఆద్యాత్మిక వ్యవహారాలను తెలుగులోకి మార్చుకోగలిగితే  తెలుగు హృదయం స్వేచ్చగా  పలుకుతుంది. దేవునితో మాట్లాడే భాష హొదా తెలుగుకు వస్తుంది.  ఆ ఆనందం వర్ణించలేనిది.. 
పూర్వ కాలంలో  మన  దేశంలోని   రాజులు  చక్రవర్తులు  తమ  తమ  మాతృ  భాషలలో  ప్రజలతో సంభాషించేవారు. ఆలాగే   ధైనందిన జీవిత వ్యవహారాల  పరిష్కారాల  విషయంలో కుడా మాతృభాషనీ ఉపయోగించడం వలన ప్రజలకు రాజ్యపాలన దగ్గరైంది.. ప్రజల భాషలోనే  కుడా రాజ్యపాలన సాగింది . ఎవరైనా  భాధితుడు  వచ్చి ధర్మ గంటను మ్రోగిస్తే ,  రాజు విచ్చేసి భాధితుడి   మొర  విని నిందితుడ్ని పిలిపించి  అందరి సమక్షంలో విచారించేవాడు.  అ విచారణలో  ఇరు పక్షాలు వాదోపవాదాలు  మాతృ భాషలో జరిగేవి.  తీర్పురి  అయన రాజుగారికి  ఫిర్యాది  - నిందితుడికి   మద్య మధ్యవర్తిగా  ఎ ''ప్లీడరు'' వుండేవాడు కాదు.. 
రాజు విచారణ జరిగేటప్పుడు  ప్రజల  భాషలోనే   ప్రశ్నించి  వివాద  మర్మాన్ని  పసిగట్టేవాడు.  చివరకు ప్రజల భాషలోనే  తీర్పు   ప్రకటించే వాడు.  ఈ మేరకు అటు విచారణ  ఇటు తీర్పు   ప్రజల సొంత భాషల్లొ జరగటంతో మధ్యవర్తుల ఆవసరమే వుండేది  కాదు.  తీర్పు సొంత భాషలో రావడంతో పిర్యాదునికిగాని, నిందుతుడుకిగాని  అర్థం కానిదంటు ఎమి వుండేది  కాదు. ప్రస్తుత న్యాయపరిపాలన  విధానంతో ఆనాటి పద్దతులను  పోల్చి చూసుకుంటే ఎంతో క్షోభ కల్గుతుంది.. 
జెరెమి జువిట్ (Jeremy Jewett) విజిటింగ్ కార్డ్ తెలుగులో..! హైదారాబాద్ మహానగరంలో..  అమెరికా కాన్సులేట్‌ .అక్కడ.ఓఅధికారి..తెలుగులోమాట్లాడుతున్నాడు.వింతగాచూస్తున్నారు,విశేషంగా మాట్లాడుకుంటున్నారు.  ఎవరు ఆ అధికారి ఎందుకని వింతగా చూస్తూ మాట్లాడుతున్నారు. 
ఆయన అమెరికా వాసి. ఆయన  ఉద్యోగం  మహానగరంలో   ఉన్న అమెరికన్ కాన్సులేట్‌లో వైస్ కౌన్సెల్  మరియు వీసా అధికారి.ఈ ఉద్యోగపర్వంలో ఆయన విధి తన మాతృదేశమైన అమెరికాకు ఇక్కడి నుండి వెళ్ళే యోగ్యమైన వాళ్ళను ఎన్నుకుని వాళ్ళకు వీసాలు ఇవ్వడమో ఇవ్వకపోవడమో! అందులోనూ తమ దేశభాష అయిన ఆంగ్లము గురించి ఆలోచించడమో లేదా పరీక్షించడమో తప్ప వేరే ఇతర భాష గురించో సంస్కృతి గురించో అస్సలు ఆలోచించనక్కర్లేదు కూడా!!! కానీ… 
ఆయన అక్కడితో ఆగిపోలేదు. ఆయన ఎంత అమెరికా వాసి అయినా వృత్తి రీత్యా తనకు తెలుగు అవసరం కాకపోయినా ఆయన మమేకమవ్వవలసింది తెలుగు వాళ్ళతో కాబట్టి ఇక్కడి భాషను మాట్లాడగలిగితేనే ఇక్కడి వాళ్ళకు మరింత చేరువ కాగలమన్న తలపుతో ఆయన మన తెలుగు భాషని  నేర్చుకోవాలనుకున్నారు! ఆరు నెలలు అక్కడే తెలుగును అభ్యసించారు… చివరికి మన తెలుగువాడిలా మాట్లాడటం మొదలుపెట్టారు!ఈయన తెలుగు ఉచ్చరణ కూడా మనవాళ్ళలానే ఉంటుందిట! తెలుగు చదవడం కూడా వచ్చట! జెరెమి జువిట్విజిటింగ్ కార్డ్ కూడా తెలుగులోనే ఉంటుందిట!..



ఎవరనుకొన్నారీ తెలుగు వాడు ???? 

సృష్టికి ప్రతి సృష్టి చేసి,  వసిష్టుని కెదురు ప్రశ్నేవేసిన రాజుగా , రాజర్షిగా,   బ్రహ్మర్షిగా పై కెదిగిన.. 

అల విశ్వామిత్రునకు ఆదర్శ కుమారుడు.. భరుతునికి సహజన్ముడు, భారత మ్రాజ్యరాజ పదవికి వారసుడు.
ఒక  బ్రహ్మయై  - కాల జ్ఞానం.. ఒక బ్రహ్మనయై  - సమాజవాదం.. ఒక వేమనయై - వేదసారం.. ఉర్వికి బోధించినోడు .. సిద్దేంద్రుడై " కూచిపూడి " శివనాట్యం చేసినవాడు.
కాకతీయ సామ్రాజ్యం   " ఘనం "  ముగా  పాలించినవాడు ..
విజయనగరంనందు    " భువనవిజయం" సాధించినాడు
తెలుగుపాట అరువనోట పలికించిన వాడు.. త్యాగయ్య.
భారత రాజ్యాంగ గీత ప్రవచించెన వాడు.. అల్లాడి కృష్ణయ్య.
త్రివర్ణ పతాక రేఖలు తీర్చెన వాడు.. పింగళి వెంకయ్య.
భాష స్వాతంత్రోద్యమంలో సమరాలు చెసినవాడు.. గిడుగు రామమూర్తి  పంతులు.
గుండెను మరాతుపాకీకి కి గురి చూపెన వాడు.. టంగుటూరి వీరేశలింగం పంతులు.విల్లమ్ములతో పిరంగి గుళ్ళనడ్డే న వాడు.. అల్లూరి సీతారామరాజులు.
దేశమంటే  " మనుషు "లని.. జాతీయ దృక్పదాన్ని నేర్పినవాడు.. గురజాడ అప్పారావు .
తెలుగు సాహిత్యయంలో మరో ప్రపంచం రచించాడు.. "నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నోక్కటి.."   అన్నాడు.. శ్రీ శ్రీ /  శ్రీరంగం శ్రీనివాసరావు.. 


వట్టి మాటలు కట్టి పెట్టోయ్! గట్టి మేల్ తలపెట్టవోయ్!
మనభాషను మనంరక్షించుకోకపోతే మరెవరూ రక్షిస్తారు
మన భాషని మనం మాట్లడక పొతే  మరెవరూ మాట్లాడుతారు...?
మన అక్షరాలు మనం వ్రాయకపొతే.. ఎవరు వ్రాస్తారు....?
మన సాహిత్యం మనం చదవకపొతే.. ఎవరు చదువుతారు....?
మన అమ్మను మనం గౌరవించకపొతే.. ఎవరు గౌరవిస్తారు....?
యాభై ఏడక్షరాలు...మూడు ఉభయాక్షరాలున్న.
మన వర్ణమాల ప్రపంచ భాషల్లొనే రెండొది... 
భాష-మమకారం
తెలుగు భాషమీద మమకారం చాలామందిలోన ఉంది,
తెలుగు గురించి మనమేమైనా ఎందుకు చెయ్యకూడదూ ఆలోచన కలిగింది...
ఆలోచనకి కార్యరూపం ఇవ్వాలన్న ఉత్సాహం కలిగింది.
మరికాస్త విస్తృత ప్రచారం అవసరం అని మాత్రం అనిపిస్తోంది.
 తల్లి పాడే చందమామ పాట కొండెక్కిపొతుంది...
బామ్మ చెప్పే ఓరాజు కధ కంచికి పొయింది...
అమ్మ మమ్మిగా మారిపొతుంది...
నాన్న అనే తెలుగు తొటకు డాడి అనే కలుపు అంటుకుంది...
ఎ బి సి డి ల వేడికి తెలుగు పలుకులు మాడిమసయిపొయాయి.. 
బుడతడి భుజం మీదున్న బండెడు పుస్తకాలలొ.. మచ్చుకైన ఒక్క తెలుగు పుస్తకం కనబడకుండా పొయింది...
భాష దురభిమానాన్ని ఎవరూ హర్షించరూ... నాలొ నేనే మట్లాడుకుంటూ... నన్ను నేనే ఓదార్చుకుంటూ... మన భాషమీద మనం అభిమానం చూపించడానికి: ఇతర భాషలని కించపరచాల్సిన అవసరం లేదు.. ద్వేషించాల్సిన అవసరం లేదు.. విసర్జించాల్సిన అవసరం కూడా లేదు....!
మన భాషని మనవాళ్ళతో మనం చక్కగా, హాయిగా మాట్లాడుకుంటే చాలు.
మన భాషలోని తీయదనాన్ని మనం రుచిచూస్తే చాలు.. మన భాషని మన పిల్లలకి అందిస్తే చాలు.

మన అభిమానాన్నీ మన ఆనందాన్నీ మిగతా తెలుగువాళ్ళతో ఎందుకు పంచుకో కూడదూ?
ఈ ఆలోచనకి కార్యరూపం ఇచ్చే ప్రయత్నమే  "తెలుగు రక్ష
తెలుగునాట తెలుగు ప్రచారాన్ని గురించి మరింత చర్చించి,
ఒక కార్యాచరణ విధానాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని అమలుపరచాలన్నది......
మరి  కాంక్ష  ఆ కాంక్ష మీకూ ఉంటే ఆలస్యం చెయ్యకుండా చేయికలపండి.

తెలుగు ఒక వెలుగు వెలుగుతుందా?
మన భాషని మనమే చిన్నబుచ్చుకుంటూ ఉంటే,
ఇతర భాషల వాళ్లు ఎందుకు గౌరవిస్తారు?
మన ఉద్యోగాలకి ఇంగ్లీష్ పనికి వచ్చే భాష కావచ్చు.
కానీ, దాన్ని నేర్చుకోవడం కోసం మన మాతృభాష ని అవమానించడం
ఈ రోజుల్లో చాలా పే....ద్ద గొప్ప గా మారిపోయింది.
తెలుగు లో ఎవరైనా ఎం. ఏ చేస్తున్నానని చెప్తే, ..
"తెలుగా" అంటూ పెదవి విరవని వాళ్లు ఉండనే ఉండరు.
ఇక తెలుగు భాష లో ఏదైనా పరిశోధన చేస్తున్నామని చెప్పండి...
ఇవన్నీ దేనికి ఉపయోగ పడతాయి?...
అనవసరం గా కాలయాపన తప్పిస్తే...?
అంటూ వెనక్కి లాగే వాళ్ళే ఎక్కువ. మన సంస్కృతినీ,
మన భాషనీ ముందు తరాల వాళ్ళకి మనమే
అందించాలన్న స్పృహ ఉన్నవాళ్ళు చాలా అరుదు.
అటువంటి వారంతా ఒక్క తాటిపైకి రాగలిగితే,
మన భాష కి మన వంతు సేవ చేసిన వాళ్ళం అవుతాం.
ఎవరైనా అటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే, తెలుసుకోగోరుతున్నాను

తెలుగునాట తెలుగు ప్రచారాన్ని గురించి మరింత చర్చించి,
అలాగేఅంటరాని భాషగా తొసేస్తున్న...
మన వింత మనస్తత్వాన్ని ఎవరూ సమర్ధించరూ కూడ...!

మా తెలుగు తల్లికి మల్లెపూదండ...
అంటూ...ఏకంగా తెలుగు భాషకే ...
మంగళ హారతి పాడేస్తున్నాం...
నేను తెలుగు వల్లభుడిని...
అందుకే తెలుపుతున్నాను....

నాలొ నేనే మట్లాడుకుంటూ...
నన్ను నేనే ఓదార్చుకుంటూ...
గడిపిన క్షణాలను మరచి పొతున్నాను...


తెలుగును పునరుజ్జీవింప జేద్దాం
భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం.

ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా.


మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం.











No comments:

Post a Comment