Tuesday, February 18, 2014

తెలుగుజాతి మేల్కొనాలి.. k

తెలుగుజాతి మేల్కొనాలి.. 
..... భూమిపుత్రుల భాషలు.. బలిపీమెక్కుతున్నాయి.. మట్టి మనుషుల మాటలు మూగబోతున్నాయి.. జాతి అస్తిత్వాన్ని చాటే ఆచారాలు అదృశ్యేమౌతున్నాయి..  జాతిజనులకు సొంత గొంతుకనిచ్చే వారసత్వ సంస్కృతిక   సాంప్రదాయాలు  సర్వానాశనమౌతున్నాయి.. 

..... భాష జాతికి ప్రాణం వంటిది.. భాష జాతికి అంతరాత్మ లాంటిది.. భాష జాతియొక్క సంస్కృతి, సంప్రదాయాలను మోసుకువెళ్ళే రక్తప్రవాహం..  ఒక జాతికి గల సంపదలన్ని పొయినా  సహించుకొవచ్చును.. మరల సంపాదించు కొనవచ్చును.. కాని ఒక జాతియొక్క భాష పోయిందంటే, ఆజాతి బానిసజాతి అవుతుంది. అసలు జాతే ఉండదు..  

..... ప్రాణం మీద ఏవిధంగా.. శరీరం శరీరావయవాలు ఆధారపడి ఉన్నవో.. ఆవిధంగానే భాషమీద జ్ఞానవిజ్ఞానాలు.. మానాభిమానాలు.. అదికారానధికారాలు.. సాంస్కృతిక-సంప్రదాయాలు మొదలగు మానవాధికారాలన్ని ఆధారపడినవి..!!       

..... తెలుగు భాష 57అక్షరాలు 3ఉభయాక్షరాలు ఉన్న మన వర్ణమాల ప్రపంచములో తెలుగు 14వ స్థానంలోనూ.. భారతదేశంలో 2వ స్థానంలోనూ..(జాతీయ భాష ఓటింగులో నిలిచిన భాష).. తెలుగుభాష గొప్పదనాన్ని.. 


.. హాల్డన్ అనే గొప్ప సైంటిస్ట్ ఇండియాలో సైన్సు బాగా  భొదించు బాష ఒక తెలుగేనని చెప్పియున్నాడు..  
..... ఇటాలియన్ ఆఫ్ ధ ఈస్ట్ అని 1816ఎ.డి  క్యాంప్ బెల్..  విశ్వ ప్రాంతీయ భాషల కంటే తెలుగు భాష మధురమైనది అని 1937 మూల్ బర్నెల్.. తెలుగు భాష ప్రపంచీకృతమౌతున్నదని.. 1857 సి.పి బ్రౌన్.. దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయులు.. మొ!! ప్రపంచ ప్రముఖ మేధావులే కీర్తించారు..  ..మరి నేడు..  

..... తల్లి పాడే చందమామ పాట కొండేక్కిపోయింది.. భామ్మ చెప్పే కథ కంచికి పోతావుంది.. మన అమ్మ - నాన్న తెలుగుతోటలో మమ్మీ - డాడి కలుపు అంటుకుంది..!! 
..... దేశం.. తెలుగుదేశం.. దేవుళ్ళు తెలుగు దేవుళ్ళు పూజారులు తెలుగువారే.. పూజ చేయించుకొను వారు తెలుగువారే.. కాని పూజలు మాత్రం తెలుగులో కాకుండా సంస్కృతంలోనో.. అరవంలోనో.. జరుగుచున్నవి.. అలాగే నమాజ్ అరబ్ లోనో.. పార్థన ఇంగ్లీషులోనో జరుగుచున్నది..!!

..... తెలుగు భాష ప్రమాదంలో ఉందా ?   తెలుగు జాతి ప్రమాదంలో ఉందా  ? తెలుగులేని జాతిని ఎమనీ పిలవాలి ?ఆంగ్లేయులపాలనలో నాణేలమీద   కనిపించిన తెలుగు..  తెలిగీయుల పలనలో పెదాలమీద కనిపించకపోతుంటే......చుస్తుంటారా.. చూస్తూనే ఉంటారా.. రండి..  కలసిరండి..   కదిలిరండి .... తెలుగు భాష రక్షణకై సైనికులలా - తెలుగు జాతి పక్షానికై సేవకులలా ! తెలుగువీర మిత్రుల్లారా..


..... ఎందుకు ఈ పరిస్థితి మనకు..   మోజులు ఎక్కువ  - పోజులు ఎక్కువ  - మన బాషకి బూజులు.. ఒక్క మాటలో చెప్పాలంటే.. నాడు ఆంగ్లేయులు పాలించారు - నేడు ఆంగ్లభాష పాలిస్తుంది..  మనం ఎలా కాపాడుకోవాలి..!!  ఇంటిభాషగా..బోధనాభాషగా..పాలనాభాషగా. వ్యహరిక బాషగా అమలు జరిగినపుడు.. 
తెలుగు బతుకుతుంది.. ఇంటి భాషగా.. చిన్న పెద్ద.. తేడా లేకుండా.. తెలుగును వాడుతుంటే.. పద సృష్టి 
జరుగుతుంది..  బోధనా భాషగా.. మన వ్యవస్థ.. తెలుగు ముత్తకుండానే.. డిగ్రీ పట్టా పొందగలడు.. ఇంగ్లీష్.. మల్లీ స్పెషల్ ఇంగ్లీష్.. మార్కుల కోసం సంస్కృతం.. ఇంటర్లో పుట్టి.. తరువాత ఎక్కడా పనికి రాదు..!!తెలుగు పండితులు చూసీ చూడనట్లు ఉండాలి.. ప్రోత్సహించాలి హిందీలాగ.. పాలనా భాషగా.. 88%తెలుగు.. GO's..రేషన్ కార్డు కోసం.. వాటర్ కార్డు కొసం.. మొత్తం.. ఇంగ్లీష్ లోనే..  వ్యహరిక బాషగా.. ఎ ఇద్దరు వొచ్చి రాణి సంకరభాష.. గుడ్ మార్నింగ్  తో మొదలు..   





..... నాడు మన భాషను - మన సంస్కృతి (సంప్రదాయాలను) అవహేళనతో దూరీకరించారు.. అది శారీరక హింస..నేడు ప్రపంచికరణ - కంప్యూటరీకరణ (ఆధునికత) పరాచకాలతో పరాయికరించారు.. ఇది మానసిక హింస..అభివృద్ధి చెందిన.. పది దేశాలను తీసుకున్నట్టు అయితే రెండు దేశాలు మాత్రమె ఆంగ్లం మాతృభాషలు.. మిగిలిన ఎనిమిది దేశాలు తమ తమ మాతృభాషలె అన్న విసయాన్ని గుర్తుంచుకోవాలి..! 


..మనసుతో పనిలేని ఓయంత్రమా ఈతెలుగువాడు..? ఏజాతి సమస్త వ్యవహారాలూ ఆజాతి మాతృభాషలో జరుగుతాయో ఆ జాతి సుఖపడుతుంది. ఆంగ్లేయులను వాళ్ళ దేశాలను పరిశీలిస్తే దురాక్రమణత్వం వల్ల భౌతిక సంపదలు సమకురాటమేకాక వారి భాష కూడా వాళ్ళ ఆక్రమించిన దేశాల్లో రాజ్యం ఏలింది. ఏలుతున్నది. తమజీవితంలో అన్నిరంగాల్లో తమ మాతృభాషా వాడుకంలో ఉండేలావాళ్ళుకృషి చేస్తారు,ఇంట్లో,ఆఫీసులో,కోర్టులోచివరికిచర్చిలోకుడావాళ్ళు మాతృభాషలోనే  వ్యవహారాలూ నడుస్తాయి.. 

..... మన కోర్టులో జడ్జీ తెలుగువాడే.. వాదించే ప్లీడరూ తెలుగువాడే.. నేరస్తుడు తెలుగువాడే.. నేరం మోపబడిన వాడూ తెలుగువాడే.. కాని వాదన మాత్రం ఇంగ్లీషులో జరుగుతుంది.. తీర్పుగూడా ఇంగ్లీషులోనే ఇవ్వబడుతుంది.. ఇందువలన అనేక అన్యాయాలను ప్రజలు అమాయకంగా అనుభవించవలసి వస్తుంది..!! 


..... ఎవరనుకొన్నారీ తెలుగు వాడు ???? సృష్టికి ప్రతి సృష్టి చేసి,  వసిష్టుని కెదురు ప్రశ్నేవేసిన రాజుగా , రాజర్షిగా,   బ్రహ్మర్షిగా పై కెదిగిన.. అల విశ్వామిత్రునకు ఆదర్శ కుమారుడు.. భరుతునికి సహజన్ముడు, భారత మ్రాజ్యరాజ పదవికి వారసుడు.ఒక  బ్రహ్మయై  - కాల జ్ఞానం.. ఒక బ్రహ్మనయై  - సమాజ వాదం.. ఒక వేమనయై-వేదసారం.. ఉర్వికిబోధించినోడు.సిద్దేంద్రుడై"కూచిపూడి"శివ నాట్యం  చేసినవాడు.కాకతీయ సామ్రాజ్యం"ఘనం"ముగా పాలించినవాడు.. విజయ నగరంనందు" భువనవిజయం" సాధించినాడు.. తెలుగుపాట అరువనోట పలికించిన వాడు.. త్యాగయ్య. భారత రాజ్యాంగ గీత ప్రవచించెన వాడు.. అల్లాడి కృష్ణయ్య.త్రివర్ణ పతాక రేఖలు తీర్చెన వాడు.. పింగళి వెంకయ్య.భాష స్వాతంత్రోద్యమంలో సమరాలు చెసినవాడు.. గిడుగు రామమూర్తి  పంతులు.గుండెను మరాతుపాకీకి కి గురి చూపెన వాడు.. టంగుటూరి వీరేశలింగం పంతులు.విల్లమ్ములతో పిరంగి గుళ్ళనడ్డే న వాడు.. అల్లూరి సీతారామరాజులు. దేశమంటే  " మనుషు "లని.. జాతీయ దృక్పదాన్ని నేర్పినవాడు.. గురజాడ అప్పారావు . తెలుగు సాహిత్యయంలో మరో ప్రపంచం రచించాడు.. "నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నోక్కటి.." అన్నాడు.. శ్రీ శ్రీ..


..... జెరెమి జువిట్ (Jeremy Jewett) విజిటింగ్ కార్డ్ తెలుగులో..! హైదారాబాద్ మహానగరంలో..  అమెరికా కాన్సులేట్‌.అక్కడ.ఓఅధికారి..తెలుగులోమాట్లాడుతున్నాడు.వింతగాచూస్తున్నారు,విశేషంగా ట్లాడుకుంటున్నారు. ఎవరు ఆ అధికారి ఎందుకని వింతగా చూస్తూ మాట్లాడుతున్నారు. ఆయన అమెరికా వాసి. ఆయన  ఉద్యోగం  మహానగరంలో   ఉన్న అమెరికన్ కాన్సులేట్‌లో వైస్ కౌన్సెల్  మరియు వీసా అధికారి.  ఈ ఉద్యోగపర్వంలో ఆయన విధి తన మాతృదేశమైన అమెరికాకు ఇక్కడి నుండి వెళ్ళే యోగ్యమైన వాళ్ళను ఎన్నుకుని వాళ్ళకు వీసాలు ఇవ్వడమో ఇవ్వకపోవడమో!  ఆయన ఎంత అమెరికా వాసి అయినా వృత్తి రీత్యా తనకు తెలుగు అవసరం కాకపోయినా ఆయన మమేకమవ్వవలసింది తెలుగు వాళ్ళతో కాబట్టి ఇక్కడి భాషను మాట్లాడగలిగితేనే ఇక్కడి వాళ్ళకు మరింత చేరువ కాగలమన్న తలపుతో ఆయన మన తెలుగు భాషని  నేర్చుకోవాలనుకున్నారు! ఆరు నెలలు అక్కడే తెలుగును అభ్యసించారు… చివరికి మన తెలుగువాడిలా మాట్లాడటం మొదలుపెట్టారు! ఈయన తెలుగు ఉచ్చరణ కూడా మనవాళ్ళలానే ఉంటుందిట! తెలుగు చదవడం కూడా వచ్చట!  జెరెమి జువిట్విజిటింగ్ కార్డ్ కూడా తెలుగులోనే ఉంటుందిట..!!

..... జీతం కోసం ఆంగ్లభాష - జీవితం కోసం తెలుగుభాష .....  
..... వట్టి మాటలు కట్టిపెట్టివోయె.. గట్టి మేలు తలపెట్టవోయే.. మన భాషను మనం రక్షించుకోకపోతే మరెవరూ రక్షిస్తారు.. మన భాషను మనం మాట్లాడకపోతే మరెవరు మాట్లాడుతారు.. మన అక్షరాలు మనం వ్రాయకపోతే ఎవరు రాస్తారు.. మన సాహిత్యం మనం చదవకపొతే.. ఎవరు చదువుతారు.. మన అమ్మను మనం గౌరవించకపోతే.. ఎవరు గౌరవిస్తారు..     !!


                          

No comments:

Post a Comment